హైదరాబాద్ ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్‌ను మరో అవార్డు వరించింది. హైదరాబాద్ నగరానికి ‘స్వచ్ఛత ఎక్సలెన్సీ’ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. 10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాలలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. భాగ్యనగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.