వరంగల్ అర్బన్:- ఈరోజు కలక్టరేట్ లో జరిగిన గ్రీవెన్సెల్ లో దారుణం చోటు చేస్కుంది. షేక్ అహ్మద్ అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే , షేక్ అహ్మద్ తన మిత్రులు కమలాకర్,శివ,సంతోష్ లతో కలిసి హైదరాబాద్ మూసాపేట లో హుటల్ పెట్టుకుందాం అని అనుకున్నారు. దీంతో అహ్మద్,కమలాకర్ ఇరువురు కలిసి వారి వ్యాపారం కోసం 10,00,000/- అప్పు చెయ్యగా శివ, సంతోషులు డబ్బులు ఇస్తాం అని చెప్పి మోసం చేసారు. దీంతో అహ్మద్,కమలాకర్,కలక్టరేట్ లో జరిగిన గ్రీవెన్సెల్ లో హాజరుకాగా, తన బాధని తట్టుకోలేక పోయిన అహ్మద్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అక్కడే వున్నా సుబేదారి ఎస్ ఐ మహేందర్ వెంటనే సంఘటన జరుగుతున్న స్థలానికి చేరుకొని అహ్మద్ ని హాస్పటల్ కి తరలించారు.

https://www.youtube.com/watch?v=pEA9gMPE4UI