‘గోవిందుడు’ వచ్చే వరకు ‘గూఢచారి’దే హవా -బిజ్ ఈ న్యూస్


బిజ్ ఈ న్యూస్ :టాలీవుడ్‌ సక్సెస్ రేటు వారానికి వారానికి తగ్గిపోతోంది. రేర్‌గా సక్సెస్ ఫిల్మ్ పడుతున్న టాలీవుడ్‌లో ‘రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి’ తర్వాత కరెక్ట్ సినిమా ఏదీ అంటే చెప్పడం కాస్త కష్టమే. 2018లో టాలీవుడ్‌కి ‘భాగమతి’ హిట్ ఇస్తే.. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ దానిని కంటిన్యూ చేసింది. ప్రస్తుతం 8వ నెల నడుస్తున్న ఈ సంవత్సరంలో టాలీవుడ్‌కి పట్టుమని 8 సక్సెస్ సినిమాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి వారం 2కు పైగా సినిమాలు విడుదలవుతున్నా.. సక్సెస్ మాత్రం సున్నా అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అలాంటిది ఒకే రోజు విడుదలైన ‘చిలసౌ’, ‘గూఢచారి’ చిత్రాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని.. టాలీవుడ్‌ని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. వీటితో పాటు విడుదలైన ‘బ్రాండ్ బాబు’ మాత్రం బాక్సాఫీస్‌పై బ్రాండ్ వేయలేకపోయింది.

ఇక విషయానికి వస్తే.. ‘గూఢచారి’ చిత్రం టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంతో పాటు విడుదలైన ‘చిలసౌ’ టాక్ పరంగా ఓకే అనిపించుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం డల్‌గానే రన్ అవుతోంది. ‘గూఢచారి’ మాత్రం ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుండటం విశేషం. ‘గూఢచారి’ తర్వాత దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ‘శ్రీనివాసకల్యాణం’, ఆ తర్వాత వచ్చిన లోకనాయకుడి ‘విశ్వరూపం 2’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోయాయి. దీంతో ‘గూఢచారి’కి అదృష్టం కలిసొచ్చింది. విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ వచ్చే వరకు ‘గూఢచారి’కి తిరుగేలేదు. ఆగస్ట్ 15న విడుదల కాబోతున్న ‘గీతగోవిందం’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. విజయ్ దేవరకొండ గోవిందుడుగా నటిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడితే మాత్రం ‘గూఢచారి’కి బ్రేక్ పడే అవకాశం ఉంది. లేదంటే ఇంకొన్ని రోజులు ‘గూఢచారి’దే హవా.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *