హైదరాబాద్‌: నగరంలో మరోసారి స్వైన్ ఫ్లూ పంజా విసురుతుంది. తాజాగా గాంధీ ఆసుపత్రిలో ఐదు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళలు కాగా ఇద్దరు పురుషులు ఉన్నారు. ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురిలో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరోకరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా వైద్యులు తెలిపారు. వీరితోపాటు మరో ఐదుగురికి స్వైన్‌ఫ్లూ లక్షణాల ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు.