కోహ్లీ ఇన్నింగ్స్‌ అద్భుతం.. నాయకుడంటే అతడే..-బిజ్ ఈ న్యూస్


సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసల జల్లు.

బర్మింగ్‌హామ్‌,బిజ్ ఈ న్యూస్ : భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మరోసారి పరుగుల యంత్రం అని రుజువు చేసుకున్నాడు. ఇంగ్లిష్‌ గడ్డపై తొలి శతకం సాధించి తన సత్తా చాటాడు. మరో వైపు ఆటగాళ్లు వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా బాధ్యతనంతా భుజాలపై వేసుకుని జట్టును నడిపించాడు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో శతకం పూర్తి చేశాడు.

ఇంగ్లాండ్‌ బౌలర్లు కోహ్లీని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా విజయవంతం కాలేకపోయారు. కోహ్లీ ఒంటరి పోరాటానికి యావత్తు క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సామాజిక మాధ్యమాల వేదికగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ శతకం సాధించినప్పుడు చేసుకున్న సంబరాలకైతే మ్యాచ్‌ చూస్తున్న వారంతా ఫిదా అయిపోయారు. మ్యాచ్‌ ముగించుకుని కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న సమయంలో మైదానంలో అభిమానులంతా లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు. మరో పక్క కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా గ్యాలరీలో నిల్చుని చప్పట్టు కొడుతూ కనిపించింది.

* కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ ఎంతో ముఖ్యమైనది. శతకం సాధించినందుకు అభినందనలు: సచిన్‌ తెందుల్కర్‌

* వాట్‌ ఏ ఛాంపియన్‌ 100? నాయకుడు ముందుండి జట్టును నడిపించాడు. ఇలాంటి నాయకుడు అవసరం. నిజంగా అద్భుత ఇన్నింగ్స్‌ కోహ్లీ. వెల్‌డన్‌ ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌: హర్భజన్‌ సింగ్‌

* ప్రపంచంలోనే బెస్ట్‌ స్ట్రోక్ ప్లేయర్‌ కోహ్లీ. కానీ, ఈ శతకంలో కోహ్లీ స్ట్రోక్స్‌ లేవు. 40 బంతులును వదిలేశాడు. అందులో 26 అండర్స్‌వే: సంజయ్‌ మంజ్రేకర్‌

* ఇన్‌క్రెడిబుల్‌ ఇన్నింగ్స్‌ కోహ్లీ. బంతిపై ఒక్కడే యుద్ధం చేశాడు: మైకెల్‌ వాన్‌

* అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ కోహ్లీ తానేంటో నిరూపించుకుంటూనే ఉన్నారు. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లతో నిలబడి శతకం సాధించడం అంత సులువు కాదు. ఎంతో ఓర్పు, పట్టుదల కావాలి: ఆర్పీ సింగ్‌

* విరాట్‌ కోహ్లీ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌. అలాగే నిజమైన నాయకుడు. ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ స్కోరుకు దగ్గరగా తీసుకెళ్లాడు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

* కోహ్లీ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్‌. ముందుండి జట్టును కాపాడాడు. అతని పట్టుదల అలాంటిది: వీవీఎస్‌ లక్ష్మణ్‌

* టెస్టు సిరీస్‌కు గొప్ప ఆరంభం దక్కింది. సెన్సెషనల్‌ బ్యాటింగ్‌ కోహ్లీ: సురేశ్‌ రైనా

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *