మంగపేట: కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి రానివ్వొద్దని ఎస్సై వెంకటేశ్వర్‌రావు సూచించారు. సోమవారం మండలంలోని పాలాయిగూడెం గొత్తికోయగుంపులో సివిల్, సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆధార్‌కార్డులను పరిశీలించారు. ఎస్సై మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎవరిని గ్రామాలోక్లి రానివ్వొద్దన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని చెప్పారు.