హైదరాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు కాన్వాయ్ కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. సాధార‌ణంగా వీఐపీలు, ముఖ్య‌మంత్రుల వాహ‌ణ శ్రేణి వెళ్తుందంటే ఆ రాజ‌సాన్ని, హుందా తనాన్ని, వాహ‌నాల వేగాన్ని చూసేందుకు జ‌నం ఆస‌క్తి చూపిస్తుంటారు. వాహ‌నం వెన‌క వాహ‌నం, వేగం, అన్నీ ఒకే వ‌ర్ణంతో ఉండే వాహ‌నాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ర్శిస్తుంటాయి. ఇక ముఖ్య‌మంత్రుల కాన్వాయ్ వెళ్తుందంటే ఆ ఠీవీ, ద‌ర్పం ఎంతో గంభీరంగా ఉంటుంది.
ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉండే తెలంగాణ ముఖ్య‌మంత్రి వాహ‌ణ శ్రేణిలో అదికారులు తాజాగా కొన్ని మార్పులు చేస్తున్నారు. వేగంతో పాటు భ‌ద్ర‌త‌ను ద్రుష్టిలో ఉంచుకుని ముఖ్య‌మంత్రి కాన్వాయ్ లోని వాహ‌నాల‌ను మారుస్తున్నారు అదికారులు. కొత్త వాహ‌నాల‌తో, కొత్త సంవ‌త్స‌రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు జుయ్ జుయ్ మంటూ ప్ర‌యాణం కొన‌సాగిస్తార‌న్న మాట‌. ఇక వాహనాలు ఎలా, ఏ కంపెనీ వాహ‌నాలో తెలుసుకుందాం..!!

ట్ర‌బుల్ షూట‌ర్ కు ట్ర‌బుల్స్‌ : కేసీఆర్‌-హ‌రీష్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా: నెల రోజులుగా మాటల్లేవ్‌
ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు కు కొత్త వాహన శ్రేణిని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం సిద్ధం చేస్తోంది. 2014 లో టయోటా వాహనాలను సీఎం కు సమకూర్చిన పోలీసు విభాగం, ఈ సారి కూడా అవే వాహనాలను సమకూర్చనున్నారు. మెర్సిడెజ్ బెంజ్, ఇతర ఖరీదైన వాహనాలను సమకూర్చాలని నిర్ణయించినా, సీఎం వాటిని కాదనడంతో టయోటా వాహనాలనే ఖరారు చేశారు. కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా కొత్త కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

కొత్త వాహన శ్రేణిలో టయోటా ల్యాండ్ క్రూజర్, పార్చునర్, ప్రాడోస్ రకాలను ఖరీదు చేయనున్నారు. ప్రాడో కారు ధర 93 లక్షలు, ఫార్చునర్ కారు 33 లక్షలుండగా పన్నులు, ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. కార్లను ఖరీదు చేసిన తరువాత బుల్లెట్ ఫ్రూప్ చేయించాల్సి ఉంటుంది. సీఎం వాహన శ్రేణిలో లో ఏడు నుంచి పది కొత్త వాహనాలు ఉండనున్నాయి. కేసీఆర్ కోసం ప్రాడో వాహనాన్ని ఎంపిక చేశారు. ఈ వాహనాన్ని ఎక్కువగా గజ్వేల్ నుంచి హైదరాబాద్ రాకపోకలు సాగించేందుకు ఎక్కువగా వినియోగించనున్నారు. దీంతో న‌గ‌ర రోడ్ల పైన ముఖ్య‌మంత్రి వాహ‌నాల కాన్వాయ్ కూడా చూడ‌ద‌గ్గ అంశంగా చేర‌బోతోంది.