జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:- కిసాన్ సన్మాన్ నిధి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు పథకంలాగానే, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కిసాన్ సన్మాన్ నిధిని పేరుమీద పథకాన్ని ,అమలు చేశాడని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాన్ని , పి.ఎం.మోడీ కాపీ కొట్టుతున్నడాని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు..రైతులకు అండగా ఉండడానికి సీఎం కేసీఆర్ పెద్ద పీఠం వేశారని అన్నారు..అదేవిధంగా దేశంలో పీఎం మోడీ, కేసీఆర్ అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేస్తున్నాడని అన్నారు.మోడీకి దమ్ముంటే, కేసీఆర్ లాగా, రైతులు ఎన్ని ఎకరాలు కలిగివున్న ,అన్ని ఎకరాలకు రైతు బంధు పథకం అమలు చేయాలని సూచించారు…ఆదివారం అగ్రికల్చర్ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన కిసాన్ సన్మాన్ నిధి కార్యక్రమాన్ని బండారి భాస్కర్ ప్రారంభించారు.ఈ రోజు రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమాయింది .ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి 6 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించింది.ఈ స్కీం కోసం కేంద్ర బడ్జెట్‌లో 75 వేల కోట్లు కేటాయించింది. ఏడాదిలో మూడు విడతలుగా చెల్లించనున్న ఈ పథకంలో…తొలి విడత 2 వేల నగదును ఇవాళ కోటి మంది రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయబోతున్నారు. మరో కోటి మందికి రెండు మూడు రోజుల్లో డబ్బులు అందుతాయని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ అధికారి గోవిందు నాయక్ . ఎంపీపీ సుభాన్. వ్యవసాయ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.