రంగారెడ్డి: చేవెళ్ల కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని వెంటనే  చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డిఇఒ  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యలు తెలిపారు.