పెద్దపల్లి ప్రతినిధి :- రామగుండం, కమిషనరేట్ పరిధిలోని మంథని మండలం లోని పోతారం లో అక్రమ టేకు కలప నిల్వస్థావరాల పై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేయగా మూడు లక్షల విలువగల పది టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నారు.ఏడుగురు వ్యక్తుల అరెస్టు చేయగా ఇందులో ప్రధాన నిందితుడైన ఎడ్ల శ్రీనివాస్ తో పాటు మరో ప్రధాన అనుచరులు పరారీలో ఉన్నారు.

సీపీ మాట్లాడుతూ దీనిని డ్రోన్ కెమెరా సహాయంతో ఛేదించమని, పర్యవరనానికి హాని కలిగించే వారిని ఉపేక్షించేది లేదని అడవి జంతువులను గాని, అడవులను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగె అంతరాష్ట్ర స్మగ్లర్లను గుర్తించడం జరిగింది.వాటికి ఎవరైనా అధికారులు సహకరించినట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.