బెంగళూరు:  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిద్ధరామయ్య బెంగళూరు నుంచి మైసూరుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనాల శ్రేణిలో వెనుక వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ఐదు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయన సెక్యూరిటీగా ఉన్న ఎస్ఐ మారి గౌడ తీవ్ర అస్వస్థతకు లోనై గుండెపోటుతో చనిపోయాడు. సిద్దరామయ్య మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  ఐదు సుమోలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.