ములుగు ప్రతినిధి :- ఈ రోజు ములుగు ఏరియా హాస్పటల్ లో డాక్టర్స్ తో రివ్యూ మీటింగ్ లో భాగంగా హాస్పటల్ వసతులను పరిశీలిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ కనిపించే దేవుళ్లుగా ప్రజలు డాక్టర్స్ ను కొలుస్తారని ఆలాంటి ప్రజలకు మనోదర్యం ఇస్తూ వైద్యం అందించాలని నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండి సేవా చెయ్యాలని అదేవిదంగా శానిటేషన్ సిబ్బంది గత 3నెలలుగా జీతాలు రాకపోవడం తో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే జీతాలు చెల్లించాలని సదరు కాంట్రాక్టర్ ను సీతక్క ఆదేశించారు. ఈ కార్యక్రమములో డాక్టర్ గోపాల్ రావు మరియు డాక్టర్ నారాయణరెడ్డి హాస్పటల్ స్టాఫ్ మరియు మాజీ ఎంపీపీ నల్లెల కుమారస్వామి .చింతనిప్పుల బిక్షపతి వంగ రవి తదితరులు పాల్గొన్నారు.