నర్సంపేట: 10-01-2019
నర్సంపేట నియోజక వర్గం, వరంగల్ రూరల్ జిల్లా…

-రాజుపల్లెలో స‌ర్పంచ్ ఎన్నిక ఏక‌గ్రీవం..
-మ‌హిళా స‌ర్పంచ్ గా నామాల భాగ్య‌మ్య‌.

స్థానిక స‌ర్పంచ్ ల ఎన్నిక ప్ర‌క్రియ‌లో న‌ర్సంపేట రూర‌ల్ మండ‌లం రాజుప‌ల్లె గ్రామం ఆద‌ర్శంగా నిలిచింది. స‌ర్పంచ్ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. మ‌హిళ‌ను స‌ర్పంచ్ గా ఎన్నుకుని విశిష్ట‌త‌ను చాటుకున్నారు రాజుప‌ల్లె ప్ర‌జానీకం. నామాల భాగ్య‌మ్య‌ను స‌ర్పంచ్ గా ఎన్నుకున్నారు. అంతేకాకుండా 8 వార్డుల అభ్య‌ర్థుల ఎన్నిక కూడా ఏక‌గ్రీవం కావ‌డం విశేషం. స్థానిక స‌ర్పంచ్ ఎన్నిక‌ను పోటీ లేకుండా ఏక‌గ్రీవం చేసినందుకు ఎన్నికైన మ‌హిళ‌ల‌ను గౌరవ ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అభినందించారు. మిగ‌తా గ్రామాలు కూడా రాజుప‌ల్లె లాగా స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ల ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని పిలుపునిచ్చారు…
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూనె నిర్మల, వార్డు మెంబర్లు, మహిళా కార్యకర్తలు & తదితరులు పాల్గొన్నారు…