ఎస్‌బీఐ ఖాతాదారులూ… జర జాగ్రత్త ..-బిజ్ ఈ న్యూస్


  • ఎవరి డెబిట్‌ కార్డును వారే ఉపయోగించాలి
  • భార్య కార్డునైనా భర్త ఉపయోగించకూడదు
  • ఏటీఎంలో డబ్బు రాకపోతే బ్యాంక్‌కు సంబంధం లేదు
కడప, బిజ్ ఈ న్యూస్ : ఎవరి ఏటీఎం కార్డు వారే వినియోగించుకోవాలని కోర్టు స్పష్టంగా చెబుతోంది. నగదును తీసుకురావాలంటూ మీ ఏటీఎం కార్డును సమీప బంధువులు, స్నేహితులకు, కనీసం భార్యకార్డు భర్త, భర్త కార్డు భార్య సైతం ఉపయోగించకూడదని భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) చెబుతోంది. ఇది సబబేనని న్యాయస్థానం కూడా అంగీకరిస్తోంది. ఏటీఎం కార్డును సంబంధిత ఖాతాదారుడే ఉపయోగించాలనే నిబంధన ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
ఒకవేళ అత్యవసరమనుకుని ఏటీఎం కార్డును ఇతరుల ద్వారా నగదు తెప్పించుకునే దశలో భాగంగా ఏటీఎంలో డబ్బు రాకుండా విత్‌డ్రా అయినట్లు రసీదు వస్తే ఆ తర్వాత ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బు మీ ఖాతాలో ఉన్నా అవి లేనట్లే. ఏటీఎం సీసీ కెమెరాల్లో ఖాతాదారుడికి బదులు ఇతరులు డ్రా చేసినట్లు తెలిసిన అవి నిబంధన ఉల్లంఘించినట్లే అవుతుంది. ఏటీఎం పిన్‌ను ఇతరులతో పంచుకోవడం నిబంధన ఉల్లంఘనే అవుతుందని ఒక కేసులో న్యాయస్థానం కేసును కొట్టివేసి ఎస్‌బీఐ నిబంధనలను సమర్ధించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలిలా ఉన్నాయి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *