తమపైన, తమ సిబ్బందిపైన పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ-బిజ్‌ కంపెనీ ఎండీ పవన్‌ మల్హోత్రా హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారం వ్యాపారం చేస్తున్నామన్నారు. విచారించిన జడ్జి జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి, పౌరసరఫరాలశాఖ కార్యదర్శికి, డీజీపీకి, హైదరాబాద్‌ కమిషనర్‌ కు, ఆర్థిక నేరాల విభాగం కమిషనర్‌కు, వరంగల్‌ ఎస్పీకి నోటీసులిచ్చారు.

Source : “ఆంధ్రజ్యోతి”
Saturday, 16 Mar, 4.40 am