వరంగల్ అర్బన్ జిల్లా :- మొదటి దశ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐనవో లు ,ధర్మ సాగర్ వేలేరు ,మండలాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఈ నెల 20 ,21 తేదీల్లో సెలవు దినం గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీచేశారు
👉ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించడం చెల్లదు

👉గత పంచాయతీ ఎన్నికల ఖర్చులు చూపలేదని వే టు తగదు

👉ఎన్నికల సంఘం ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు

👉పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించి అభ్యర్థులను మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించి లేదన్న కారణంగా మూడేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదని ఇటీవల ఎన్నికల సవాల్ చేస్తూ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి సుమారు వంద పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై సంక్రాంతి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు చేపట్టారు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2013లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను వివరాలను సమర్పించి లేదన్న కారణంగా ఎన్నికల సంఘం సుమారు 1200 మంది పై అనర్హత వేటు చేసిందని తెలిపారు మౌనంగా ఉండి ఇప్పుడు అనర్హత వేటు వేయడం సరికాదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ఈసి ఇచ్చిన ఆదేశాలను అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు