వ‌రంగ‌ల్: ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి అమెరికాలో ఉన్న‌త‌ విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థుల‌ను ఇటీవ‌ల అక్క‌డి హోం ల్యాండ్ డిటెక్ష‌న్ వారు అరెస్ట్ చేయ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును క‌లిసి విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ములుగు మండ‌లానికి చెందిన చింతిరెడ్డి ర‌వింధ‌ర్‌రెడ్డి కూతురు అశ్వినిరెడ్డి ఉన్న‌త విద్యాభ్యాసానికి వెళ్లింది. అమెరికా పోలీసులు ఇటీవ‌ల స్టింగ్ ఆప‌రేష‌న్ పేరుతో ప‌లువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని డిటెన్ష‌న్ సెంట‌ర్ ఉంచారు. తెలంగాణ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి త‌గు న్యాయ‌స‌హాయం చేసి విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అమెరికాలోని నాటా, టాటా, ఆటా ఆసోసియేష‌న్ స‌భ్యుల‌తోపాటు, తెలంగాణ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల‌ను ఆదుకునేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీఇచ్చారు.