సౌత్‌ నార్త్  అన్న తేడా లేకుండా ప్రస్తుతం అని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ప్రముఖుడు చేరనున్నాడు. మిసైల్‌ మ్యాన్‌గా భారత దేశానికి ఎన్నో సేవలందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలుగు నిర్మాతలు అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ను హాలీవుడ్‌ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారట. ఇప్పటికే కథ విన్న అనిల్‌ కపూర్‌ నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.