అతి నిద్రతో అకాల మరణం..-బిజ్ ఈ న్యూస్


హ్యూస్టన్‌, బిజ్ ఈ న్యూస్ : ఆరోగ్యానికి నిద్రే కీలకం. నిద్ర సరిగా లేకపోతే లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే అతిగా నిద్రపోతే అకాల మరణం సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే అకాల మరణం ముప్పు ఉందని వెల్లడైంది. 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయిన వారు 33శాతం త్వరగా చనిపోయే అవకాశం ఉందని, వాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *