వరంగల్ ప్రతినిధి:-ఈరోజు అలంకార జంక్షన్ TNGO’S భవన్ లో ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ సర్పంచుల సన్మాన అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు శంకర్,బొమ్మల కట్టయ్య,రౌతు రమేష్ హాజరై కొత్తగా ఎన్నుకైనా సర్పంచులను సన్మానించిన అనంతరం మాట్లాడుతూ, బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబెడ్కర్ స్పూర్తితో ప్రజలకు సేవలు అందిస్తూ అంబెడ్కర్ కలలు కన్నా స్వరాజ్యాన్ని నిర్మించాలని కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు నిస్స్వార్థం తో గ్రామాల అభివృద్ధికి పాల్పడి, దళిత బహుజనులకు చేయూతను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుంచు రాజేందర్,మాలమహానాడు జిల్లా నాయకులూ బండి అశోక్,నోముల వెంకటేష్,సురాసి రాజు,దండు రాజు తదితరులు పాల్గున్నారు.